యేసయ్య నా యేసయ్య కనికరించుమయా

రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

  • Telugu
  • English
  • Audio

యేసయ్య నా యేసయ్య కనికరించుమయా (2)
ఆశతో ఉన్నానయా – ఆదరించుమయా

మాటలే ఒక మౌనమై – ఎదురు చూసేను
మౌనమే ఒక రాగమై – కరుణ కోరేను
ఎదలోయలో – తొలిమంచులా – నన్ను తాకుమయా

॥ యేసయ్య నా యేసయ్య ॥

1. లోకమే విడనాడిన – ప్రాణమే వేసారిన
ఊరుకోలేదే నీవే – చేరదీసావే
కారుమేఘము కమ్మినా – వేదనై వెంటాడిన
బాధతో రగిలే నా – మనసులో కలతే
మరువనన్న నీ కృప – వెతికే నా కొరకే
పల్లవించు పాటలా – మదిలో నీ తలపే

॥ యేసయ్య నా యేసయ్య ॥

2. వాక్యమై వెలిగించిన – దీపమై నడిపించిన
ప్రేమ చూపించే – నాపై – జాలి చూపించే
మేలు చేయు నేస్తమా – మాట తప్పని దైవమా
దేవదేవుడవే – నీవే – స్తుతులకర్హుడవే
పరవసించి నా మది – పలికే నీ స్తుతులే
నింగి నేల సాక్షిగా – నిలిచే నీ క్రియలే

॥ యేసయ్య నా యేసయ్య ॥

Yesayya Naa Yesayya Kanikarinchumaya (2)
Aashatho Unnaanayaa – Aadarinchumayaa

Maatale Oka Maunamai – Eduru Choosenu
Mauname Oka Raagamai – Karuna Korenu
Edaloyalo – Tholimanchulaa – Nannu Thaakumayaa

॥ Yesayya Naa Yesayya ॥

1. Lokame Vidanaadina – Praaname Vesaarina
Oorukolede Neeve – Cheradeesaave
Kaarumeghamu Kamminaa – Vedanai Ventaadina
Baadhatho Ragile Naa – Manasulo Kalathe
Maruvananna Nee Krupa – Vethike Naa Korake
Pallavinchu Paatalaa – Madilo Nee Thalape

॥ Yesayya Naa Yesayya ॥

2. Vaakyamai Veliginchina – Deepamai Nadipinchina
Prema Choopinche – Naapai – Jaali Choopinche
Melu Cheyu Nesthamaa – Maata Thappani Daivamaa
Devadevudave – Neeve – Sthuthulakarhudave
Paravasinchi Naa Madi – Palike Nee Sthuthule
Ningi Nela Saakshigaa – Niliche Nee Kriyale

॥ Yesayya Naa Yesayya ॥

Share This Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *