నను విడువలేదయ్యా నేను పారిపోయినవెదకినన్ను

రచయిత: మనోజ్ (MJ) మథాయ్
Lyricist: Manoj (MJ) Mathai

  • Telugu
  • English
  • Audio

నను విడువలేదయ్యా నేను పారిపోయిన
వెదకినన్ను పట్టుకున్నావు

నీకుదూరమైనను నిను కాదనిపోయినా
వెంటాడి హత్తుకున్నావు

నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
వందనాలయ్యా యేసు వందనాలయ్యా

మొండిజీవితమేనాది మార్పుకోరనిది
అహంకారమెనాలో అలలై పొంగుచుండెను
అన్నీ ఉన్నాయన్నా గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది
ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలుగా చెల్లాచేదురైపోయింది

నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా

గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపెవు
నా స్థితిగతులే మార్చేసావు
నూతన జీవం నాకిచ్చావు

నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా

Nanu Viduvaledayyaa Nenu Paaripoyina
Vedakinannu Pattukunnaavu

Neeku Dooramainanu Ninu Kaadanipoyinaa
Ventaadi Hatthukunnaavu

Nee Prema Nithyamu Vembadisthoone Undayyaa
Nee Krupa Nanu Viduvaka Kanikaristhoone Undayyaa
Vandanaalayyaa Yesu Vandanaalayyaa
Vandanaalayyaa Yesu Vandanaalayyaa

Romance

Mondi Jeevithamenadi Maarpukoranidi
Ahankaaramenalo Alalai Ponguchundenu
Annee Unnaayannaa Garvam Nee Madhura Swaram Vinalekapoyindi
Aakasmatthugaa Naa Jeevitham Andhakaaramlo Padipoyindi
Naa Hrudayam Mukkalugaa Chellacheduraipoyindi

Nee Prema Nithyamu Vembadisthoone Undayyaa
Nee Krupa Nanu Viduvaka Kanikaristhoone Undayyaa

Gaadandhakaarame Nannu Naluvaipu Chuttukunnadi
Brathukuthaananna Aashe Lekunda Krungajesenu
Kanneellatho Mokaallapai Koorchoni
Morapetti Praarthinchuchunnaanu
Aa Cheekati Rojullo Prathyakshamayyaavu
Divya Velugulatho Nanu Nimpevu
Naa Sthithigathule Maarcheshaavu
Noothana Jeevam Naakichchaavu

Nee Prema Nithyamu Vembadisthoone Undayyaa
Nee Krupa Nanu Viduvaka Kanikaristhoone Undayyaa

Share This Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *