- Telugu Lyrics
- Audio
నడిపించు నా దేవా – జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ – పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో – ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో – మారుమూల పల్లెలలో (2)
1 ఎవరో వేసిన పంటను కోసే – పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే – ఆత్మల నివ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే – పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే – భారము నివ్వయ్య (2) ||దున్నని||
2 ఎదిగే క్రమములో పిలుపును మరిచే – గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే – ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే – పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
3 ఇతరుల ఆస్తిపై కన్ను వేసే – దొంగను నేను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను యేసయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే బాగ్యమునివ్వయ్యా (2) ||దున్నని||
నడిపించు నా దేవా – జరిగించు నీ సేవ song lyrics, దున్నని బీడు భూములలో Full song lyrics Dunnani Beedu Bhoomulalo Song lyrics