New Year – నూతన సంవత్సర పాటలు - Praise Songs – స్తుతి పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌

Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌
(2)
అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
(2)
అరాధన ఆపను – స్తుతియించుట మానను
(2)
స్తుతియించుట మానను

1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) || అంతా నా మేలుకే ||

2. ఆస్తులన్ని కోల్పొయిన – కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన – గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక  (2) || అంతా నా మేలుకే ||

3. అవమానం ఎంతైన – నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు (2)
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు (2) || అంతా నా మేలుకే ||

4. ఆశలే సమాధియైన – వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని – రక్షణకై ఆనందింతున్‌
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) || అంతా నా మేలుకే ||

5. చదువులే రాకున్న – ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న – భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు  (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు (2) || అంతా నా మేలుకే ||

6. సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై  (2) || అంతా నా మేలుకే ||

7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే  (2) || అంతా నా మేలుకే ||

Nenellappudu Yehovaanu Sannuthinchedan
Nithyamu Aayana Keerthi Naa Noota Nundun
(2)
Anthaa Naa Meluke – Aaradhana Yesuke
Anthaa Naa Manchike – Tana Chittamunaku Thala Vanchite
(2)
Aaradhana Aapanu – Stuthinchuta Maananu
(2)
Stuthinchuta Maananu

1. Kanneelle Paanamulaina – Kathina Dhuhkha Baadhalaina
Sthithigathule Maarina – Avakasham Chejarina
Maaradu Yesu Prema – Nithyudaina Thandri Prema (2)
Maaradu Yesu Prema – Nithyudaina Thandri Prema (2) || Anthaa Naa Meluke ||

2. Asthulanni Kolpoyina – Kannavare Kunumarugaina
Oopiri Baruvaina – Gundele Pagilina
Yehova Ichchenu – Yehova Theesikonenu (2)
Aayana Naamamunake – Stuthi Kalugu Gaaka (2) || Anthaa Naa Meluke ||

3. Avamaanam Enthaina – Naa Vaare Kaadanna
Neenu Thappa Evarunnaara Aakaashamandhuna?
Neenu Naa Kundhaga – Edhi Naakakkara Ledu (2)
Neenu Naa Kundhaga – Edhi Naakakkara Ledu (2) || Anthaa Naa Meluke ||

4. Aashale Samaadhiyaina – Vyaadhi Baadha Velluvaina
Adhikaramu Koppukoni – Rakshanakai Aanandinthun
Naadu Manassu Nee Meeda – Anukonaga O Naadha (2)
Poornashaanti Ne Pondi Ninne Ne Keerthinthun (2) || Anthaa Naa Meluke ||

5. Chaduvule Raakunna – Ootami Paalaina
Udyogam Lekunna – Bhoomike Baruvaina
Naa Yedala Nee Thalampulu – Entho Priyamulu (2)
Nee Uddheshinchinadhi Nishphalamu Kaneradu (2) || Anthaa Naa Meluke ||

6. Sankalpana Pilupondi – Ninne Preminchu Naku
Samastamu Samakoodi – Melukai Jarugunu
Yesuni Saaroopyamu Neenu Pondalani (2)
Anumathinchina Ee – Viluvaina Siluvakai (2) || Anthaa Naa Meluke ||

7. Neenu Cheyunadhi – Naakippudu Theliyadu
Ika Meedata Neenu – Thelisikondunu
Prastuthamu Samasthamu – Dhuhkha Karame (2)
Abhyasinchina Neethi – Samaadhaana Phalame (2) || Anthaa Naa Meluke ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *