- Telugu Lyrics
- English Lyrics
- Audio
జయ సంకేతమా దయాక్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్య (2)
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు (2)
నడిపించే నీ ప్రేమ పిలుపు || జయ సంకేతమా ||
1. నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే (2)
నన్నెలా ప్రేమించ మన సాయేను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదలా
నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేదా నా యాజమానుడా (2) || జయ సంకేతమా ||
2.నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా (2) || జయ సంకేతమా ||
3. నీ కృప నా యెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిది (2)
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయే నాకెన్నడు
ఆత్మ బలముతో నను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా (2) || జయ సంకేతమా ||
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య Song Lyrics
Hosanna Songs Telugu Lyrics
Hosanna Ministries 2023 All New Songs
Hosanna Ministries Songs with Lyrics