Hope Songs - నిరీక్షణ పాటలు - New Year – నూతన సంవత్సర పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Thanksgiving – కృతజ్ఞత పాటలు - Worship Songs - ఆరాధనా పాటలు - హోసన్నా మినిస్ట్రీస్ పాటలు

ఘనమైనవి నీ కార్యములు నా యెడల

రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

  • Telugu Lyrics
  • English Lyrics
  • Audio

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)

కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2)        ||ఘనమైనవి||

1.యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము          ||ఘనమైనవి||

    2. నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము          ||ఘనమైనవి||

    3. నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము          ||ఘనమైనవి||

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల Lyrics

    HOSANNA MINISTRIES 2021 NEW YEAR SONG LYRICS

    Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala
    Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa
     (2)
    Krupalanu Ponduchu Kruthagnatha Kaligi
    Sthuthularpinchedanu Anni Velalaa (2)
    Anudinamu Nee Anugrahame
    Aayushkaalamu Nee Varame (2)     ||Ghanamainavi||

    Ae Thegulu Sameepinchaneeyaka – Ae Keedaina Dari Cheraneeyaka
    Aapadalanni Tholage Varaku – Aathmalo Nemmadi Kalige Varaku (2)
    Naa Bhaaramu Mosi – Baasatagaa Nilichi – Aadarinchithivi
    Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu     ||Ghanamainavi||

    Naaku Etthaina Kotavu Neeve – Nannu Kaapaadu Kedemu Neeve
    Aashrayamaina Bandavu Neeve – Shaashwatha Krupakaadhaaramu Neeve (2)
    Naa Prathikshanamunu Neevu – Deevenagaa Maarchi – Nadipinchuchunnaavu
    Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu     ||Ghanamainavi||

    Nee Krupa Thappa Verokati Ledayaa – Nee Manasulo Nenunte Chaalayaa
    Bahu Kaalamugaa Nenunna Sthithilo – Nee Krupa Naa Yeda Chaalunantive (2)
    Nee Arachethilo Nanu – Chekkukuntivi – Naakemi Koduva
    Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu     ||Ghanamainavi||

    Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala Song Lyrics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *