మెల్లని స్వరమే వినిపించావే చల్లని చూపుతో

రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

  • Telugu
  • English
  • Audio

మెల్లని స్వరమే వినిపించావే
చల్లని చూపుతో దీవించినావే

వాక్యపు ఒడిలో లాలించినావే
ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే
నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా
నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2)         ||మెల్లని||

తీయని గీతాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని
అమృత రాగాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని (2)
నాకంటే ముందుగా నీవొచ్చినావే
నీ మాట నా పాటగా మార్చేసినావే (2)         ||మెల్లని||

కృంగిన కాలములో వేదనల వేళలో
సోమసిన సమయములో నిను నేను చేరితిని (2)
నా గాథ అంతయు గమనించినావే
నా గుండె మంటలను ఆర్పేసినావే (2)         ||మెల్లని||

Mellani Swarame Vinipinchinaave
Challani Chooputho Deevinchinaave

Vaakyapu Odilo Laalinchinaave
Aathmeeya Badilo Nannu Penchinaave
Nee Mellani Swarame Challani Choope Naaku Padi Velayaa
Nee Mellani Swarame Challani Choope Naaku Subhaagyamayaa (2)    ||Mellani||

Theeyani Geethaanni Vinipinchaalani
Challani Velalo Ninu Nenu Cherithini
Amrutha Raagaanni Vinipinchaalani
Challani Velalo Ninu Nenu Cherithini (2)
Naakante Mundugaa Neevochchinaave
Nee Maata Naa Paatagaa Maarchesinaave (2)    ||Mellani||

Krungina Kaalamulo Vedanala Velalo
Somasina Samayamulo Ninu Nenu Cherithini (2)
Naa Gaadha Anthayu Gamaninchinaave
Naa Gunde Mantalanu Aarpesinaave (2)    ||Mellani||

Share This Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *