Gospel Songs - సువార్త పాటలు - Hope Songs - నిరీక్షణ పాటలు - ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ రండి

రచయిత:
Lyricist:

  • Telugu
  • English
  • Audio

రాజులకు రాజైన ఈ మన విభుని
పూజ చేయుటకు రండి

ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని       ||రాజులకు||

కరుణ గల సోదరుండై ఈయన
ధరణికేతెంచెనయ్యా (2)
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును       ||రాజులకు||

నక్కలకు బొరియలుండే నాకాశ
పక్షులకు గూళ్లుండెను (2)
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను       ||రాజులకు||

త్వరపడి రండి రండి ఈ పరమ
గురుని యొద్దకు మీరలు (2)
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము       ||రాజులకు||

Raajulaku Raajaina Ee Mana Vibhuni
Pooja Cheyutaku Randi

Ee Jayashaali Kannaa
Manakinkaa Raajevvarunu Lerani       ||Raajulaku||

Karuna Gala Sodarundai Eeyana
Dharanikethenchenayyaa (2)
Sthiramuga Nammukonina
Manakosagu Paraloka Raajyamunu       ||Raajulaku||

Nakkalaku Boriyalunde Naakaasha
Pakshulaku Goollundenu (2)
Okkintha Sthalamainanu
Mana Vibhuni Kekkada Lekundenu       ||Raajulaku||

Thvarapadi Randi Randi Ee Parama
Guruni Yoddaku Meeralu (2)
Dariki Jerina Vaarini
Ee Prabhuvu Tharumadennadu Dooramu       ||Raajulaku||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *