Hope Songs - నిరీక్షణ పాటలు - Prayer Songs - ప్రార్థన పాటలు - Repentance – పశ్చాత్తాప పాటలు

వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో

రచయిత: pastor D. Maniprakash
Lyricist: పాస్టర్ డి. మణిప్రకాష్

  • Telugu
  • English
  • Audio

వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో
 (2)
వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా
నీ రాక కోసమై – కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2)        ||వాడబారని||

మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2)
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

Vaadabaarani Vishwaasamutho
Shubhapradamaina Nireekshanatho
 (2)
Vechiyunnaanayyaa Kanipettuchunnanayyaa (2) Yesayyaa
Nee Raaka Kosamai – Kadaboora Shabdamukai
Nee Mahima Kosamai – Ninnu Cherutakai (2)          ||Vaadabaarani||

Mokaallapai Vechithi – Kanneella Paryanthamai
Beedu Baarina Nela Vaanakai – Eduru Choochina Sanghamai (2)
Siddhapadiyunna Vadhuvunai
Aashatho Vechaanayyaa (2) Yesayyaa          ||Nee Raaka||

Lekhanamulanu Choochithi – Guruthulu Gamaninchithi
Pravachana Neraverpulanni – Jaruguta Gurthinchithi (2)
Raaraajuvai Neevu Raavaalani
Eduru Choochuchunnaanayyaa (2) Yesayyaa          ||Nee Raaka||

Neeti Korakai Vechina – Gooda Baathunu Polina
Aathma Daahamu Thodanindi – Allaaduchunnanayyaa (2)
Loka Bandhaala Nundi
Nee Chelimi Koraanayyaa (2) Yesayyaa          ||Nee Raaka||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *