Yesayya Yesayya Ne Mata Chalayya Lyrics – Anwesha
Singer | Anwesha |
Composer | |
Music | KY Ratnam |
Song Writer | Prasad Nelapudi |
Lyrics
యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా (2)
బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది
రక్షణనిచ్చి ఆదరించేది (2)
నీ మాటే యేసయ్యా మము బ్రతికించేదయ్యా
నీ మాటే యేసయ్యా మా అక్కరలన్ని తీర్చేది (2) ” యేసయ్యా ” 1)
నీ మాట చెప్పున వలలు వేయగా విస్తారమైన చేపలుతో వలలు నిండెనయ్య
నీ మాట చెప్పున చెట్టు దిగిన జెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినదయ్య (2)
అయిదు రొట్టెలు రెండు చేపలు అయిదు వేల మందికి
పంచెను నీ మాటే యేసయ్యా(2) ” నీ మాటే” 2)
నీ మాట చెప్పున నమ్మి వెళ్లిన శతాదిపతి దాసుడు
స్వస్థత పొందెనయ్య నీ మాట చెప్పున
పాపము విడచిన సమరయ
స్త్రీ జీవజలములు పొందుకున్నదయ్య (2)
చనిపోయిన లాజరును సమాధిలోనుండి జీవముతో
లేపినది నీ మాటే యేసయ్యా (2) ” నీ మాటే” ” యేసయ్యా”