pavurama nee prema entha madhuramu Lyrics – Tony Prakash
Singer | Tony Prakash |
Composer | |
Music | |
Song Writer |
Lyrics
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
Show less