NINU CHERE PRATHI KSHANAM Lyrics – KS Chitra Garu
Singer | KS Chitra Garu |
Composer | Joshua Shaik |
Music | Pranam Kamlakhar |
Song Writer | Joshua Shaik |
Lyrics
నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు
1. నీ పిలుపే నా కోసం – నీ పలుకే ఆధారం నీకే ఆరాధనా
కన్నుల్లో నీ రూపం – కనిపించే నా దైవం నిన్ను నే చేరగా
నీ ప్రేమే మాధుర్యం – నడిపించే నా దీపం నీవు నా తోడుగా
నీ వరమే ఈ స్నేహం – నాతోనే కలకాలం యేసయ్య నా రక్షకా
వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును
2. నీ తలపే నా ధ్యానం – నా మనసే నీ సొంతం నిన్ను ప్రేమింతును
నీతోనే సహవాసం – నను కోరే అనురాగం యేసయ్య నా ప్రాణమా
నీతోనే చిరకాలం – సాగాలి నా పయనం గమ్యమే నీవుగా
నీ ప్రేమే అపురూపం – మన్నించే మమకారం నీవే నా ప్రేరణ
ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను యేసయ్య నీ సేవలో నేను తరియింతును