Ninnu Nenu Keerthinthunu Lyrics – Sireesha
Singer | Sireesha |
Composer | P Methuselah |
Music | K Y Ratnam |
Song Writer | P Methuselah |
Lyrics
పల్లవి: నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా
నీ నామమునూ ప్రకటింతునూ “2”
నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావనీ
నాకు తోడు నీడగ నీవే వుంటావనీ “2” #నిన్ను నేను#
1. శూన్యము నుండి సృష్టిని చేసినావనీ
సృష్టిని పాలించ మమ్ము చేసినావనీ “2”
పాలించే అధికారం కోల్పోయిన వేళలో
పాలించే అధికారం మాకిచ్చుట కొరకై “2”
పరలోకము విడచి మాకై ధరకే ఏతెంచినావననీ “2” నిన్ను నేను
2. మా స్వస్థతకై నలుగగొట్టబడినావనీ
ఆఖరి రక్తపు బొట్టును కార్చినావనీ “2”
మా రక్షణ కై ప్రాణం పెట్టినావనీ
మరణమును గెలిచి తిరిగి లేచినావనీ “2”
సదా కాలం మాతో ఉండ ఆత్మరూపిగానే నీవు ఉన్నావని “2” #నిన్ను నేను#