Nee Sannidhiye Naa – నీ సన్నిధియే నా ఆశ్రయం నీ నామమే నా ఆధారం Lyrics – Satya Yamini


 


Singer Satya Yamini
Composer Sayaram Gattu
Music Prabhu Kumar
Song Writer Sayaram Gattu

Lyrics

నీ సన్నిధియే నా ఆశ్రయం నీ నామమే నా ఆధారం (2)

స్తోత్రింతును, నిన్ను మరువను నీ వాక్యమే నా దీపము (2) హల్లెలూయా , హల్లెలూయా (2)

చీకటి లోన నే సాగితిని పాపనికి రూపముగా నే మారితిని (2)

అంతులేని వాంఛలతో అంధురాలనయితి సాతానుకు ప్రియమయిన బంధువునయితి (2)

నీ వెలుగుతో నను నింపితివి నీ రక్తముతో నను కడిగితివి (2) || హల్లెలూయా ||

నీ నామము పలికే అర్హత లేదు నీ ప్రేమను పొందే యోగ్యత లేదు (2)

నా భారము మోసి నను కాచితివి శోధనలన్నింటి లోన కాపాడితివి (2)

నిను పొగడక బ్రతుకుట ఎలా ? నిను వదిలి నేను అడుగిడ జాల (2) || హల్లెలూయా ||

 

 

Nee Sannidhiye Naa – నీ సన్నిధియే నా ఆశ్రయం నీ నామమే నా ఆధారం Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *