నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
నీవేగా ఆశ్రయం – నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య – నా ప్రాణమే నీవేనయా
1. నీ మాటలే వెన్నంటే సాగేనే –
ప్రతీ చెంత నడవనీ నీ కృపాతమే సాక్ష్యమే – ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ
ప్రేమతో – మన్నించేటి నా దైవమా
కన్నీటిలో, కష్టాలలో – నడిపించే నీ వాక్యమే
దయామయా – కృపామయా – నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా
2. నీ స్నేహమే వరించే సొంతమై – మదిలో నీ స్వరం వసించేటి నా
ఎన్నెన్నో తరంగాలలో –
వేదన – నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై , సహాయమై – దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా – కృపామయా – నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా