NAA POURASTHITHI

 

Telugu Lyrics :

నా పౌరస్థితి పరమందున్నది
ఇల నా ఉనికి అస్థిరమైనది “2”
యాత్రికుడననీ నేనెరుగుదును
ఒకనాడు నా ఇంటికి చేరెదను “2”
1. నాశనకరమైన గుంటను పోలిన
లోకమునుండి లాగబడియున్నాను
తిరిగి జన్మించిన పరదేశీయుడను
పరలోక పిలుపును ఎరిగియున్నాను
2.  నరులారా తిరిగి రండని పిలిచిన
నేనూ అచటికి వెళ్లిపోవలయును
నిత్యత్వమందున దేవునితో ఉందును
పరలోక మహిమను అనుభవించెదను
3.  నా కొరకు త్వరగా రానైయుండిన
ప్రభు క్రీస్తు కొరకు కనిపెట్టుచున్నాను
ముందున్నవాటికై  వేగిరపడెదను
పరలోక తలపులు కలిగియున్నను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *