naa devude naaku praana snehithudu Lyrics – Nissy John, Hadlee Xavier
Singer | Nissy John, Hadlee Xavier |
Composer | Kranthi Chepuri |
Music | Hadlee Xavier |
Song Writer | Kranthi Chepuri |
Lyrics
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే||
శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని||
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||