YELO YELO SAMBARALU Lyrics

YELO YELO SAMBARALU Lyrics – Javed Ali


 


Singer Javed Ali
Composer Joshua Shaik
Music Pranam Kamlakhar
Song Writer Joshua Shaik

Lyrics

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు  

సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా

దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే

సంగీతాలే పాడాలండీ – హైలెస్సా

అంధకారాన్ని తొలగించే మహనీయుడు

పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు

నిన్నే కోరి నిన్నే చేరి

ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు

1. లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా

ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా (2)

దూతాళి పాడి – కొలిచారు చూడు

ఘనమైన ఒక వేడుక

ఆ గొల్లలేగా – దరువేసే చూడు

మెస్సయ్య – పుట్టాడనీ

మన మెస్సయ్య – పుట్టాడనీ    

2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ  – పలికింది ఊరంతా ఈ సంగతీ

ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)

మనసున్న వాడు – దయ చూపువాడు

అలనాటి అనుబంధమే

కనులారా చూడు – మనసారా వేడు

దిగి వచ్చే మనకోసమే

ఇల దిగి వచ్చే మనకోసమే

3. ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా

వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా  (2)

సలిగాలి రాత్రి  –  పిలిసింది సూడు

మనలోన ఒక పండగ

భయమేల నీకు – దిగులేల నీకు

యేసయ్య మనకుండగా

మన యేసయ్య మనకుండగా

 

 

YELO YELO SAMBARALU Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *