Koti Kaanthula Velugulatho Lyrics

Koti Kaanthula Velugulatho Lyrics – Anjana Sowmya


 


Singer Anjana Sowmya
Composer Bapu Kondeti
Music Linus Madiri
Song Writer Bapu Kondeti

Lyrics

కోటి కాంతుల వెలుగులతో

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం

లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం

దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను

దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము

లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)    ||కోటి కాంతుల||

రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా

మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)

మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను

ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను

సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా

శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా

ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2)    ||కోటి కాంతుల||

మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా

కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)

ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా

ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా

అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా

ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా

సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)    ||కోటి కాంతుల||

Koti Kaanthula Velugulatho Udayinchenu Oka Kiranam

Lokamanduna Prathi Hrudayam Chigurinchenu Ee Tharunam

Divini Vidichi Bhuvini Manakai Maanavunigaa Janminchenu

Digulu Chendaka Gathamu Marachi Yesuni Aaraadhinthumu

Lokaanike Idi Parvadinam Mahadaanandame Prathi Kshanam – (2) ||Koti||

Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve Thaanugaa

Manujulaku Maadiri Thaanai Undutake Ila Ethenchegaa (2)

Manakosame Janminchenu Thana Premane Panchenu

Aa Varamune Thanu Vidachenu Nararoopigaa Velasenu

Srushtike Moolaadhaaramaina Devude Ila Digi Vachchenaa

Shodhanaa Baadhalu Enni Unnaa Netitho Ika Dari Cherunaa

Aanandame Ika Santhoshame Prathivaaniki Shubha Parinaamame – (2) ||Koti||

Mahimagala Mahimonnathudu Pashuvula Shaalalo Pasivaanigaa

Karunagala Kaaranajanmudu Shishuvugaa Manalo Okavaanigaa (2)

Enaatiki Mana Thodugaa Undaalani Andagaa

Prathivaaniki Snehithunigaa Hrudayaana Janminchegaa

Andhakaarapu Ee Lokamandu Deva Devudu Udayinchegaa

Ennadu Leni Vevela Kaanthulu Lokamandunaa Pavalinchegaa

Santhoshame Samaadhaaname Idi Devaadi Devuni Bahumaaname – (2) ||Koti||

 

 

Koti Kaanthula Velugulatho Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *