ఆకాశంలోనా పండుగ వార్త దూతాలి తెచ్చేను రక్షణ వార్త

Akasanlona panduga varta dutali teccenu raksana varta Lyrics – AKASHI KUMAR PAMMI


 


Singer AKASHI KUMAR PAMMI
Composer AKASHI KUMAR PAMMI
Music
Song Writer AKASHI KUMAR PAMMI

Lyrics

పల్లవి: ఆకాశంలోనా పండుగ వార్త

దూతాలి తెచ్చేను రక్షణ వార్త (2)

దైవ కుమారుడులోక రక్షకుడు

పసులపాకలో పవళించిన వార్త(2)

పండుగే పండుగే – జగమంతా పండుగే (హే)

పండుగే పండుగే – లోకమంతా పండుగే (2)

గొప్ప పేదా లేదు – చిన్న పెద్ద లేదు

రాష్ట్రము దేశం లేదు – లోకమంతా పండుగే (2)  || ఆకాశంలోనా ||

1.పొలములోన గొర్రె మందలు – కాయుచుండగా

వచ్చి గాబ్రియేలు పలికే – తెల్ల మహిమతో (2)

అంతటా కాపరులు – బయలు వెళ్లిరి

పరుగు పరుగున- యేసుని చూచిరి (2)

హే ఆకాశంలో- పండుగ వార్త దైవ

కుమారుని – జనన వార్త (2)

పల్లె పల్లెలోన – ఊరు వాడల్లోన

వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)    || ఆకాశంలోనా ||

2.తారను చూచి – తూర్పు జ్ఞానులు

యేసుని ఆరాధింప – గోరి (చూడ) వెళ్లిరి (2)

యేసుని చూచి – కానుకల ఇచ్చి

ఆరాధించి – తిరిగి వచ్చిరి (2)

హే ఆకాశంలో- పండుగ వార్త

దైవ కుమారుని – జనన వార్త (2)

పల్లె పల్లెలోన – ఊరు వాడల్లోన

వీధివీధిల్లోన -క్రిస్మస్ వార్త (2)     || ఆకాశంలోనా ||

3.మొదటిసారి దీనునిగా – పసుల పాకలో పవళించెను

రెండవ సారి కొదమ సింహమై – మేఘారూఢుడై ( రాజులకు రాజుగా) రానైయుండే   (2)  (హే)

పండుగే పండుగే – జగమంతా పండుగే     (హే)

పండుగే పండుగే – లోకమంతా పండుగే (2)

గొప్ప పేదా లేదు – చిన్న పెద్ద లేదు రాష్ట్రము దేశం లేదు – లోకమంతా పండుగే  (2)   || ఆకాశంలోనా ||

 

 

Akasanlona paṇḍuga varta dutali teccenu rakṣaṇa varta Watch Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *