చెప్పుకుంటే సిగ్గు చేటు CHEPPUKUNTE SIGGU CHETU Lyrics – Satya Yamini
Singer | Satya Yamini |
Composer | Joshua Shaik |
Music | KY Ratnam |
Song Writer | Joshua Shaik |
Lyrics
చెప్పుకుంటే సిగ్గు చేటని – నేస్తమా
చెప్పకుంటే గుండె కోతని
నీలో నీవే కృంగిపోతున్నావా? అందరిలో ఒంటరివైపోయావా?
చేయి విడువని యేసు దేవుడు – ఆదరించి ఓదార్చును
నీ చేయి విడువని యేసు దేవుడు – నిన్నాదరించి ఓదార్చును
1. కసాయి గుండెలు దాడి చేసెనా? విషపు చూపులే నీవైపువుంచెనా? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు.
2. పాపపు లోకము నిను వేధించెనా? నిందలు వేసి వెక్కిరించెనా? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు.
3. నా అన్నవారే నిన్నవమానించెనా? అనాథను చేసి విడిచివెళ్లెనా? (2)
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు – చూడలేదా పొద్దు పొడుపులు.